AP: తూ.గో. జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య, అత్తను కత్తితో నరికి చంపాడు. సీతానగరం మండలం బొబ్బిలంకకు చెందిన సోడదాసి సీతారామరాజు, లత ప్రేమ వివాహం చేసుకున్నారు. గతకొంత కాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లత తన తల్లి లక్ష్మి ఇంట్లో ఉంటోంది. సోమవారం అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లిన సీతారామరాజు.. లత, లక్ష్మిలను కిరాతకంగా నరికి చంపాడు. భార్యపై అనుమానమే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు.