దారుణ హత్య.. వేట కొడవళ్ళతో నరికి చంపారు

TG: నల్గొండ జిల్లా రామగిరిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మణికంఠ లేజర్‌ కలర్‌ ల్యాబ్‌ ఓనర్‌ సురేశ్‌ (37)ను దుండగులు హత్య చేశారు. మాస్కులు వేసుకుని వచ్చిన దుండగులు వేట కొడవళ్ళతో దాడి చేసినట్లు తెలుస్తోంది. సురేశ్‌ గుండెల్లో పొడిచి మెడ పైన వేట కొడవళ్ళ నరికి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్‌ పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్