AP: కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరు మండలం చాగంటిపాడులో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ హత్య కేసుకి సంబంధించి షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. డబ్బుల విషయంలో భార్యతో తరచూ గొడవపడే ఆనంద్, మద్యం మత్తులో భార్య సుపాదపై దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న కుమారులు, తండ్రిని నిలదీయగా మాటామాటా పెరిగి రాడ్డుతో తలపై కొట్టారు. ఈ ఘటనలో తండ్రి ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.