బంగ్లాదేశ్‌లో దారుణ హత్య.. డ్రమ్ములో హిందూ నగల వ్యాపారి మృతదేహం లభ్యం

బంగ్లాదేశ్‌లోని మైమన్‌సింగ్‌ జిల్లాలో హిందూ నగల వ్యాపారి నిరంజన్‌ చంద్ర సూత్రధర్‌ (50) మృతదేహం ప్లాస్టిక్‌ డ్రమ్ములో లభ్యమైంది. సెప్టెంబర్‌ 20న ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. బెగున్‌బారి ప్రాంతంలో నీటిలో తేలుతున్న డ్రమ్మును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహంపై గాయాల ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్యాంట్‌ జేబులో లభించిన టోకెన్‌ ఆధారంగా మృతుడిని గుర్తించారు. హత్యకు మతపరమైన కోణం ఉందా, అసలు కారణమేంటన్నది ఇంకా స్పష్టంకాలేదు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕