గణేశ్‌ మండపంలో దారుణ హత్య

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో గణేశ్‌ చతుర్థి వేడుకల సందడి మధ్య దారుణ హత్య చోటుచేసుకుంది. సంబల్పురి గ్రామంలో సోమవారం సాయంత్రం గణేశ్‌ మండపం వద్ద సౌండ్‌ సిస్టమ్‌ విషయంలో తలెత్తిన వివాదం అమన్‌ సూర్యవంశీ (23) అనే యువకుడి హత్యకు దారితీసింది. ఆకాశ్‌ సూర్యవంశీ (22)తో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయగా, అమన్‌ కత్తితో దాడి చేయడంతో ఆకాశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అమన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు మత్తు పదార్థాలకు అలవాటుపడిన వ్యక్తి అని స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕