చిట్టిల వ్యాపారి దారుణ హత్య.. మహిళల ధర్నా

TG: జగిత్యాల పట్టణంలో ప్రైవేట్ చిట్టిల వ్యాపారిపై జరిగిన దాడి, హత్య ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు, కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రారంభమైన నిరసన.. తహసీల్ చౌరస్తా వద్ద రాస్తారోకోగా మారింది. పరారీలో ఉన్న నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్