వ్యక్తి దారుణ హత్య (వీడియో)

AP: విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోని గంగాలమ్మ గుడి వెనక దారుణ హత్య జరిగింది. భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మైలపల్లి చంటి అనే యువకుడు హత్యకు గురయ్యాడు. తలపై కర్రతో కొట్టి, మెడకు నైలాన్ తాడుతో ఉరివేసినట్లు పోలీసులు గుర్తించారు. మైలపల్లి చంటి భార్య, పిల్లలతో కలిసి పెయిన్‌దొరపేటలో ఉంటూ చేపల వేట చేస్తూ జీవనం సాగించేవాడు. నిన్నటి నుంచి కొందరు తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు చంటి తన సోదరికి చెప్పినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕