TG: హైదరాబాద్ చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. బాలాపూర్ లేక్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో బాబానగర్ నివాసి మహ్మద్ అజీజ్ అక్తర్(26) అనే వ్యక్తి హత్యకు గురైనట్లు శుక్రవారం పోలీసులు గుర్తించారు. గొంతుపై చాకుతో కోసిన గాయాలు ఉన్నాయి. ఘటనా స్థలంలో ఇంజెక్షన్లు లభ్యమవడంతో డ్రగ్స్ వాడకం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.