వృద్ధురాలి దారుణ హత్య (వీడియో)

AP: చిత్తూరు జిల్లా పలమనేరు లాల్ బహదూర్ నగర్‌లో చంగమ్మ (70) అనే వృద్ధురాలు దారుణ హత్యకు గురయ్యారు. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని దుండగులు చపాతీ కర్రతో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న చంగమ్మను గుర్తించి పోలీసులకు స్థానికులు సమాచారమిచ్చారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. డబ్బు కోసమే హత్య జరిగిందా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕