AP: విశాఖలోని పెందుర్తి PS పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. శ్రీనివాసరావు (43), దేవి (34) అనే మహిళతో భార్యాభర్తలని చెప్పుకుంటూ లక్ష్మీనగర్ కాలనీలో నెల రోజులుగా అద్దెకు ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం వారి ఫ్లాట్‌లో అరుపులు వినిపించగా, తర్వాత శ్రీనివాసరావు ఫ్లాట్‌కు తాళం వేసి పారిపోయాడు. చివరికి దేవి రక్తపు మడుగులో పడి ఉంది. ఆమెను స్థానికులు కేజీహెచ్‌కు తరలించగా చనిపోయింది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.