AP: శ్రీకాకుళం (D), ఎచ్చర్ల (M), కేశవరావుపేట పంచాయతీలో దారుణ ఘటన జరిగింది. జాతీయ రహదారి సర్వీసు రోడ్డు పక్కన గురుగుబెల్లి తులసీ రత్నం (50) అనే ట్రాన్స్‌జెండర్ హత్యకు గురయ్యారు. శ్రీకాకుళం నగరంలో 15 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఈమె స్వగ్రామం ఆమదాలవలస మండలం కొత్తవలస గ్రామం. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎచ్చర్ల పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.