AP: అన్నమయ్య జిల్లాలో మహిళా దినోత్సవం రోజునే దారుణం చోటుచేసుకుంది. నిమ్మనపల్లి మండలంలోని ఓ గ్రామంలో మహిళపై ఇద్దరు కీచకులు అత్యాచారం చేశారు. సదరు మహిళ పాలు పోసి వస్తుండగా దారిలో అడ్డగించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.