బస్సులో సీటు కోసం గొడవ.. దారుణంగా తన్నుకున్నారు.. వీడియో

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో సీటు కోసం గొడవపడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిద్దిపేట- సిరిసిల్ల రహదారిలో సిద్దిపేట డిపోకు చెందిన బస్సులో గురువారం ఈ ఘటన జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు, మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి మధ్య సీటు విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సదరు మహిళలను ఆ వ్యక్తి దుర్భాష లాడటంతో గొడవ ముదిరి ఒకరినొకరు తన్నుకున్నారు. బస్సులోని యువతులు ఏకమై అతడికి దేహశుద్ది చేశారు.

సంబంధిత పోస్ట్