ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన రూ.2,449 వార్షిక ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 365 రోజుల వ్యాలిడిటీతో పాటు అదనంగా మరో 15 రోజులు, అంటే మొత్తం 380 రోజుల సేవలను పొందవచ్చు. ఇందులో అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, 100 SMSలు లభిస్తాయి. అంతేకాకుండా, ఈ ప్లాన్‌తో పాటు రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్, రూ.10,000 సైబర్ మోసాల రక్షణ కవరేజ్ కూడా లభిస్తుందని BSNL తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో వెల్లడించింది.