BSNL స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ‘ఆజాదీ కా ప్లాన్’ పేరిట కేవలం రూ.1కి 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, 2 GB డేటా లభించనుంది. ఈ ప్లాన్ కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఉచిత సిమ్‌తో వస్తున్న ఈ ఆఫర్ ఆగస్టు 1 నుంచి 31 వరకు అందుబాటులో ఉండనుంది. సమీప BSNL సర్వీస్ సెంటర్ లేదా రీటెయిలర్‌ను సంప్రదించి సద్వినియోగం చేసుకోవచ్చు.