భారతదేశంలో టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ (BSNL) పోటీని తట్టుకునేందుకు 28 రోజుల వ్యాలిడిటీతో రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.199 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. రూ.251 ధరతో స్టూడెంట్ ప్లాన్‌ను కూడా పరిచయం చేసింది. ఈ ప్లాన్‌లో 28 రోజుల పాటు 100జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందవచ్చు. ఈ కొత్త ఆఫర్లు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు గట్టి పోటీనిస్తాయి.