BSNL రూ.199 ప్లాన్ తో 28 రోజుల అన్ లిమిటెడ్

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం రూ.199తో ఒక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ కంపెనీలు ఇదే కాలానికి 1.5జీబీ డేటాకు రూ.299 వసూలు చేస్తుండగా, బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే ఎక్కువ డేటాను అందిస్తూ పోటీని తీవ్రతరం చేసింది. వొడాఫోన్-ఐడియా (Vi) 2జీబీ డేటాకు రూ.408 వసూలు చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఇటీవల లాభాల్లోకి వచ్చి, 4జీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ, 5జీ సేవలకు సిద్ధమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్