ప్రముఖ టెలికాం కంపెనీలు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) రూ.485తో ఒక కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా 72 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. ఆఫర్ వ్యాలిడిటీ వరకు అపరిమిత కాల్స్ కూడా చేసుకోవచ్చు. అయితే, ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.