BSNL సిమ్ కార్డులు TRAI బ్లాక్ చేస్తుందనే వార్తలపై PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇచ్చింది. కస్టమర్ KYC నిలిపివేశారన్న మరియు 24 గంటల్లో సిమ్ బ్లాక్ అవుతుందన్న మెస్సేజ్ నకిలీదని స్పష్టం చేసింది. BSNL తరపున పంపినట్టుగా కనిపించిన ఈ సమాచారం అసత్యమని పేర్కొంది. ఇటువంటి ఫేక్ వార్తలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. TRAI లేదా BSNL అధికారికంగా ప్రకటించని సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది.