బుద్ధవనం అద్భుత కళాఖండం: శ్రీలంక మంత్రి ప్రశంస

తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని శ్రీలంక బౌద్ధ మత సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హిణిడుమ సునిల్ సెన్వి, 22 దేశాలకు చెందిన 100 మంది బౌద్ధ ప్రతినిధులతో కలిసి సందర్శించారు. బుద్ధవనాన్ని ప్రపంచంలోనే అద్భుత కళాఖండంగా ఆయన కొనియాడారు. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బుద్ధవనం నిర్వహించిన సదస్సు ద్వారా ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇవ్వడం హర్షణీయమన్నారు. శ్రీలంక, భారత్ మైత్రిని భవిష్యత్ లోనూ కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్