బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు

టిబెట్‌కు చెందిన ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు వరించింది. బెస్ట్‌ ఆడియో బుక్‌ నెరేషన్‌ విభాగంలో ‘మెడిటేషన్’ అనే ఆల్బమ్‌కు ఈ అవార్డు దక్కింది. ఇందులో ఆయన తన ఆలోచనలు, సందేశాలను ఆడియో రూపంలో అందించారు. సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డును 90 ఏళ్ల వయసులో సాధించారు. ఈ అవార్డును దలైలామా తరఫున ప్రముఖ సంగీతకారుడు రూఫస్ వేన్‌రైట్ స్వీకరించారు.

సంబంధిత పోస్ట్