కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి (VIDEO)

దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్‌ ప్రాంతంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్‌ క్యాంపస్‌కు ఎదురుగా ఉన్న పీజీ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕