ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ కేవలం అక్రమ నిర్మాణాల కూల్చివేతకే పరిమితం కాకుండా, ఇప్పుడు 'స్టైల్ స్టేట్‌మెంట్'గా మారింది. తాజాగా డియోరియా జిల్లాలో జరిగిన ఒక వివాహ వేడుకలో, వధువు రాగిణి రాజ్‌భర్ పూలతో అలంకరించిన బుల్డోజర్ బకెట్‌పై కూర్చుని ఊరేగి వచ్చింది. ఆమె సోదరులు సంప్రదాయ పల్లకీలు, కార్లకు బదులుగా ఈ వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. ఏనుగులు, గుర్రాలు, డప్పులు, డీజే సంగీతంతో సాగిన ఈ 'బుల్డోజర్ రథం' ఊరేగింపు గ్రామస్తులను, నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.