AP: విశాఖ జిల్లా ఆనందపురం వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ పండు (జి.షణ్ముఖ) కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం మెడికవర్ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని మీడియాకు వివరించారు. రోడ్డు ప్రమాదంలో పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయని, అన్ని రకాల పరీక్షల అనంతరం కాళ్లకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆరు నెలల వరకు పూర్తి విశ్రాంతి తీసుకుంటే త్వరగా కోలుకుంటారని వైద్యులు పేర్కొన్నారు.