TG: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కురవి మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న దివ్యశ్రీ చౌహన్ అనే విద్యార్థిని.. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్నడింది. సరిగ్గా పాఠాలు చెప్పడం లేదని, ఆహారం సరిగా పెట్టడం లేదని తల్లిదండ్రులు ప్రశ్నించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 25న ఈ ఘటన జరగ్గా.. ప్రస్తుతం దివ్యశ్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.