ఏపీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రిటైర్ అయినా మళ్లీ ఉద్యోగం

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం కాకుండా కమీషన్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించిందని ఆరోపించారు. పదేళ్లలో ప్రాజెక్టులపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు డిజైన్‌, నిర్మాణ లోపాల వల్లే పనికిరాకుండా పోయాయని చెప్పారు. నీరు నిల్వ చేస్తే మేడిగడ్డ కొట్టుకుపోయి భద్రాచలం సహా పలు గ్రామాలు మునిగే ప్రమాదం ఉందని ఇంజినీర్లు హెచ్చరించారని వెల్లడించారు. కాళేశ్వరం రీడిజైన్ కారణంగా భారీ ఆర్థిక నష్టం జరిగిందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్