బంపర్‌ ఆఫర్‌.. పిల్లలను కంటే రూ. 30 లక్షలు

ప్రస్తుతం యువత పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడాన్ని భారంగా భావిస్తోంది. దీని కారణంగా ఇటలీ దేశం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జననాల రేటు తగ్గడంతో ఆ దేశం పరిష్కార మార్గాన్ని కనుగొంది. పెళ్లి చేసుకునే యువతకు భారీ క్యాష్‌ ప్రైజ్‌, గ్రాంట్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా గ్రామీణ పునరావాస గ్రాంట్‌ను అమలు చేస్తోంది. దీని కింద గ్రామాలలో వదిలేసిన ఇళ్లను కొనుగోలు చేసి, వాటిని పునరుద్ధరించే వారికి రూ.30 లక్షల వరకు అందిస్తామని తెలిపింది. అలాగే ఆర్థిక స్థిరత్వం కోసం ప్రజలకు నెలవారీ స్టైపెండ్‌లు కూడా అందించనుంది.

సంబంధిత పోస్ట్