బుమ్రా వైట్‌బాల్‌కే పరిమితం: అశ్విన్‌

దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌ ఆడిన జస్‌ప్రీత్‌ బుమ్రా, ఆదివారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. వర్క్‌లోడ్‌ నేపథ్యంలో సెలక్టర్లు అతడికి విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైట్‌బాల్‌ క్రికెట్‌కే బుమ్రా ప్రాధాన్యమివ్వాలని, తప్పదు అనుకుంటేనే టెస్ట్‌ క్రికెట్‌ ఆడాలని అతడు సూచించాడు. బుమ్రా టీ20 క్రికెట్‌ ఆడటాన్ని తాను ఇష్టపడతానని, అర్ధరహిత వన్డేలు ఆడాలని తాను కోరుకోవడం లేదని అశ్విన్‌ అన్నాడు. ఏబీ డివిలియర్స్‌ కూడా అశ్విన్‌ను సమర్థించాడు.

సంబంధిత పోస్ట్