ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నవ్వులు పూయించిన బుమ్రా.. వీడియో

లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి తన పేరు ఆనర్స్ బోర్డుపై లిఖించుకున్నాడు. రెండోరోజు మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బుమ్రా మాట్లాడుతుండగా.. ఓ రిపోర్టర్‌ ఫోన్‌ మోగింది. వెంటనే స్పందించిన బుమ్రా 'ఎవరి భార్యో ఫోన్ చేస్తున్నారు' అన్నాడు. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్