కేరళలో తాజాగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కేరళ కస్టమ్స్ అధికారులు కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.3.15 కోట్ల నగదును సీజ్ చేశారు.కారు ఫ్లోరింగ్ కింద వెల్డింగ్ చేసిన స్టీల్ కంపార్ట్‌మెంట్లలో ఈ డబ్బును దాచి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వడకర ప్రాంతానికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ నగదు సల్మాన్ కండత్తిల్ అనే వ్యక్తికి చెందినదిగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని దాడులు జరుగుతున్నాయి.