సీనియర్‌ హీరోయిన్‌ ఇంట్లో చోరీ

సీనియర్‌ హీరోయిన్‌ పూనమ్‌ ధిల్లాన్‌ ఇంట్లో చోరీ జరిగింది. ఆదివారం ఆమె బయటకి వెళ్ళినప్పుడు ఇంట్లో దొంగతనం జరిగినట్లు సమాచారం. రూ.35 వేల నగదుతో పాటు 500 డాలర్లు, వజ్రాల కమ్మలు పోయాయి. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి రంగులు వేయడానికి వచ్చిన అన్సారీ అనే వ్యక్తి జనవరి 6న ఈ చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన దగ్గరున్న రూ.25 వేల నగదు, 500 డాలర్లను, వజ్రపు ఇయర్‌ రింగ్స్‌ను పోలీసులు నటికి తిరిగి అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్