లోయలోకి దూసుకెళ్లబోయిన బస్సు.. వీడియో

హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో గురువారం చన్నిఖోడ్ సమీపంలో భూంతర్-మణికరణ్ రహదారిపై పర్యాటకులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లబోయింది. అదృష్టవశాత్తు బస్సు ముందు భాగం రోడ్డుపైనే ఆగిపోవడంతో పార్వతి నదిలో పడే ప్రమాదం తప్పింది. ప్రయాణికులు భయంతో కేకలు వేయగా, స్థానికులు స్పందించి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్