బస్సు ప్రమాద ఘటన.. ఎమ్మెల్యేను అడ్డుకున్న స్థానికులు(వీడియో)

TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలానికి చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నిరసన సెగ తగిలింది. రోడ్డు విస్తరణ పనులు ఎందుకు చేపట్టడం లేదని ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు. అనేకసార్లు రోడ్డు విస్తరణ చేయాలని చెప్పిన నిరక్ష్యం చేశారని స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. స్థానికులు నిరసన తెలపడంతో ఘటన స్థలం నుంచి ఎమ్మెల్యే కాలే యాదయ్య వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్