ఊడిపోయిన బస్సు డోరు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు

కర్ణాటకలోని సౌత్ కన్నడ జిల్లాలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. బోర్డు పరీక్షలు రాయడానికి ఆర్టీసీ బస్సు ఎక్కిన ఇద్దరు విద్యార్థినులు, ప్రయాణికుల రద్దీ కారణంగా డోరు వద్ద నిలబడ్డారు. అకస్మాత్తుగా బస్సు డోరు ఊడిపోవడంతో వారు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై విచారణకు కేఎస్ఆర్టీసీ ఆదేశించింది.

సంబంధిత పోస్ట్