నదిలో పడిన బస్సు... 40 మంది మృతి

AP: పాకిస్తాన్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బలోచిస్థాన్‌ సరిహద్దు వద్ద డాన సార్‌ అనే ప్రదేశంలో అదుపుతప్పిన బస్సు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 40 మంది ప్రయాణికులు మృతిచెందినట్లు సమాచారం. మార్గం మధ్యలో బ్రేక్‌డౌన్‌ అయిన మరో వాహనంలోని ప్రయాణికులను కూడా ఈ బస్సు ఎక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్