ఉత్తరప్రదేశ్లోని లక్నో శివార్లలో సోమవారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉదయం 6 నుంచి 6.30 గంటల మధ్య ఎక్స్ప్రెస్వే తొలి టోల్ ప్లాజా సమీపంలో బస్సు అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 44 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 31 మందిని లోక్ బంధు ఆస్పత్రికి, 13 మందిని కేజీఎంయూ ట్రామా సెంటర్కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ తెలిపారు.