ఛత్తీస్‌గఢ్‌లో చెట్టును ఢీకొట్టిన బస్సు.. ఆరుగురు మృతి!

ఛత్తీస్‌గఢ్‌లోని మనేంద్రగఢ్‌–కేల్హరి మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 30 నుండి 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, పహాడీహంస్వాహి సమీపంలోని మలుపు వద్ద అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టును వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, సిబ్బంది వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕