వ్యాన్‌ను ఢీ కొట్టిన బస్సు.. ఆరుగురు మృతి

గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ ప్రైవేటు బస్సు ప్రయాణికుల వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బస్సు డ్రైవర్ అజాగ్రత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్