పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాల్ట్ లేక్‌లోని కరుణామయికి వెళ్తున్న బస్సు, రాజర్‌హత్ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.