లోయలో పడిన బస్సు.. ముగ్గురు జవాన్లు మృతి, 30 మందికి గాయాలు (వీడియో)

జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్‌లో ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. వాటర్‌హేల్ ప్రాంతంలో BSF సైనికులతో ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా.. 30న మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జవాన్లలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్