బంగ్లాదేశ్‌లోని మున్షిగంజ్ వద్ద పద్మా వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వర్షం కారణంగా తడిగా ఉన్న రోడ్డుపై వేగంగా వస్తున్న బస్సు అదుపుతప్పి వంతెన ప్రొటెక్షన్ రైలింగ్‌ను బలంగా ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, వారిని రెస్క్యూ సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సోమవారం జరిగినట్లు తెలుస్తోంది.