అక్కాచెల్లెళ్ల పైకి దూసుకెళ్లిన బస్సు.. ఒకరు మృతి (వీడియో)

ఇద్దరు అక్కాచెల్లెళ్లపైకి స్కూల్ బస్సు దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందిన విషాద ఘటన యూపీలోని రాంపూర్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. బిలాస్పూర్ లో మిల్టన్ ఎడ్యుకేషన్ అకాడమీకి చెందిన విద్యార్థులు బస్సు దిగి ముందు వైపు వెళ్లారు. పిల్లల్ని గమనించని డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో అనబియ (7) టైర్ల కింద నలిగి మృతి చెందింది. బస్సు మధ్యలో పడటంతో జన్నత్ (4) స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి CCTVలో రికార్డయ్యాయి.

సంబంధిత పోస్ట్