AP: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఓ వ్యక్తి మద్యం మత్తులో బస్సు వెనుక ఉన్న స్టెప్నీ టైరుపై పడుకొని ప్రమాదకరంగా 15 కిలోమీటర్లు ప్రయాణించాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కొందరు ఇది గమనించి బస్సు డ్రైవర్‌కు చెప్పారు. డ్రైవర్ బస్సు ఆపి చూడగా మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కనిపించాడు. దీంతో అతడిని బయటికి రప్పించి మందలించారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి ఉంటే ఏంటి పరిస్థితి అని మండిపడ్డారు.