TG: హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కుక్కల రక్తంతో అక్రమ వ్యాపారం జరుగుతోందని జంతు ప్రేమికులు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు. చికిత్స, సంరక్షణ పేరుతో వీధి కుక్కలను ఆసుపత్రికి తెచ్చి, అనారోగ్యంతో వచ్చే పెంపుడు కుక్కల యజమానులకు అవసరం లేకపోయినా రక్తహీనత ఉన్నట్లు నకిలీ నివేదికలు సృష్టించి, రూ.18 నుంచి రూ.25 వేల వరకు ప్యాకెట్ రక్తాన్ని అమ్ముతున్నారని ఆరోపించారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉన్న వీధి కుక్కలు రక్తహీనతతో చనిపోతున్నాయని తెలిపారు.