TG: ఓ కసాయి తండ్రి కన్న బిడ్డలనే కడతేర్చేందుకు యత్నించాడు. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లా వావిలాల పల్లిలో జరిగింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు అశ్రిత్(17), కూతురు అర్చన(15)కు తండ్రి మల్లేశం ఉరేసి చంపేందుకు ప్రయత్నించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కూతురు మృతి చెందింది. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. కూల్‌డ్రింక్‌లో కూడా విషం కలిపి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మల్లేశం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.