దానం అనర్హతతో ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక నగారా

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నికల వేడి రాజుకుంది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌ ఎమ్మెల్యే పదవి కోల్పోవడంతో ఈ సీటు ఖాళీ అయింది. దీంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు ఈ సీటుపై దృష్టి సారించాయి. దానం నాగేందర్‌ మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించినా, ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారనేది ఇంకా స్పష్టం కాలేదు. అధికార కాంగ్రెస్‌కు ఈ ఉపఎన్నిక కీలకంగా మారింది. ప్రభుత్వ పనితీరు, నగర అభివృద్ధి, స్థానిక సమస్యలను ప్రచారంలోకి తీసుకురావాలని భావిస్తోంది. దానం నాగేందర్‌కే మళ్లీ అవకాశం ఇస్తారా లేదా కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపుతారా అనేది పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

సంబంధిత పోస్ట్

✕
✕