తెలంగాణలో త్వరలో మరో ఉపఎన్నిక జరగనుంది. గతంలో కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ BRS ఎమ్మెల్యేల మరణంతో ఉపఎన్నికలు జరిగాయి. ఈ రెండు స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తాజాగా దానం నాగేందర్ పైఅనర్హత వేటు పడటంతో ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇదే జోరును కొనసాగించి హ్యాట్రిక్ సాధిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ స్థానం కోసం ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు అధిష్టానం పెద్దలను కలిసినట్లు తెలుస్తోంది.