డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ రాష్ట్ర ఆదాయ వనరులపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి అవసరమైన వనరులను సమీకరించడంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది.