సీఎం రేవంత్ అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరగనుంది. డిసెంబర్ 7-9 మధ్య జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై ప్రధానంగా చర్చ జరగనుంది. అలాగే రాష్ట్రంలో జరగనున్న ఖేలో ఇండియా క్రీడలు, ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకల నిర్వహణ, తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై రివ్యూ చేయనున్నారు. ఇక ఎల్‌నినో ఎఫెక్ట్‌తో తాగునీరు, సాగునీటికి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన అంశాలపై కూడా చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕