రేపే కేబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్!

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన రేపు(గురువారం) సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో తొలి కాగిత రహిత (ఈ-కేబినెట్) సమావేశంగా దీనిని నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గత మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇకపై సమావేశాలను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం సీఎంతో సహా మంత్రులందరికీ ట్యాబ్‌లు అందజేశారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకు కూడా ఇదే తొలి సమావేశం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్